News June 14, 2024
BREAKING: ఏ మంత్రికి ఏ శాఖ?

* చంద్రబాబు – సీఎం, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు.
* పవన్ కళ్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
* నారా లోకేశ్ – మానవవనరులు, ఐటీ ఎలక్ట్రానిక్ష్&కమ్యునికేషన్.
* అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్; పశుసంవర్ధక
* నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌరసరఫరాలు
* వంగలపూడి అనిత – హోంమంత్రి, విపత్తు నిర్వహణ
Similar News
News November 27, 2025
RED ALERT: ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

AP: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని APSDMA వెల్లడించింది. దీనికి ‘దిట్వా’గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం CTR, TPT, NLR, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
News November 27, 2025
శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.
News November 27, 2025
గంభీర్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు: గవాస్కర్

టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. ప్లేయర్లను సిద్ధం చేయడమే కోచ్ పని అని, గ్రౌండ్లోకి దిగి ఆడాల్సింది ప్లేయర్లేనని స్పష్టం చేశారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు క్రెడిట్ ఇవ్వనప్పుడు, ఇప్పుడు మాత్రం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? జవాబుదారీతనం ఎందుకు అడుగుతున్నారు? జీవితాంతం కోచ్గా ఉండాలని అతడు ట్రోఫీలు గెలిచినప్పుడు అడిగారా?’ అని నిలదీశారు.


