News March 21, 2025
BREAKING.. WNP: రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతి

పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో జూరాల కాలువ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని చెలిమిల్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ హనుమంతు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికు తరలించారు.
Similar News
News December 19, 2025
భారత జలాల్లోకి బంగ్లా బోట్లు.. కవ్వింపు చర్యలు?

భారత జలాల్లోకి బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లు వస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. 4 రోజుల కిందట బంగ్లా నేవీ గస్తీ నౌక ఇలానే వచ్చింది. బంగ్లాలో త్వరలో ఎన్నికలు ఉండటం, అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో భారత నిఘా వర్గాలు కీలక విషయాన్ని గుర్తించాయి. భారత్‌ను కవ్వించేందుకు బంగ్లా ఇలా చేస్తోందని వెల్లడించాయి. పేద జాలర్లను భారత్ వేధిస్తోందని చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నమని చెప్పాయి.
News December 19, 2025
గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ బాగోతం.!

గుడివాడలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కూనసాని వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న వినోద్‌ను గుడివాడ వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వినోద్‌ను కోర్టుకు తరలించారు. మిగిలిన బెట్టింగ్ బ్యాచ్‌ను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.
News December 19, 2025
అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి మృతికి కేసీఆర్ సంతాపం

125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి, పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రపంచ స్థాయి శిల్ప కళా ప్రతిభతో కోహినూర్ వజ్రంలా నిలిచిన రామ్ సుతార్ సేవలు అపారం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గర్వకారణంగా నిలిచేలా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఆయన మరణం శిల్ప కళా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.


