News March 21, 2025

BREAKING.. WNP: రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతి

image

పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో జూరాల కాలువ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని చెలిమిల్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ హనుమంతు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికు తరలించారు. 

Similar News

News March 31, 2025

రెండు రోజులు ఎండలు.. ఏప్రిల్ 3న వడగండ్లు

image

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న 16 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో వైపు ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వచ్చే నెల 3న వడగండ్లు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.

News March 31, 2025

సాటాపూర్ గేట్ వద్ద వడ్ల లారీ బోల్తా

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.

News March 31, 2025

గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

image

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. 

error: Content is protected !!