News June 18, 2024
BREAKING: పవన్ కళ్యాణ్‌కు Y ప్లస్ సెక్యూరిటీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.
Similar News
News March 25, 2026
రష్యా, ఇరాన్‌కు ఇజ్రాయెల్ షాక్

ఇరాన్‌కు అన్ని వనరులు కట్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్-రష్యా మధ్య ఆయుధాల సరఫరాకు కీలకమైన కాస్పియన్ సముద్రం మార్గాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ నేవీ, మౌలికవసతులు ధ్వంసమయ్యేలా బందర్ అన్జాలీ పోర్టుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్ – రష్యాల మధ్య మిసైల్స్, డ్రోన్లు, గన్స్ మొదలైనవి సరఫరా కావడానికి ఈ పోర్టు కీలకం. ఈ దాడితో ఇరు దేశాలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించింది.
News March 25, 2026
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో నేటి నుంచి 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది.
News March 25, 2026
ఆముదం సాగుకు అనువైన రకాలు

☛ DCH-177: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ DCH-519: 90-180 రోజులు. దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ PCH-111: 90-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ PCH-222: 90-170 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ GCH-08: 95-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ ICH-66: 90-180 రోజులు. దిగుబడి: 7-9 క్వింటాళ్లు
☛ ICH-5: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 7-9 క్వింటాళ్లు


