News July 10, 2024
BREAKING: యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్

వావి వరసలు మరిచిపోయి తండ్రీ కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్టయ్యాడు. బెంగళూరులో అరెస్ట్ చేసిన HYD పోలీసులు పీటీ వారెంట్‌పై ఇక్కడకు తరలిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి అడ్డగోలుగా అతడు చేసిన అసభ్యకర కామెంట్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తీవ్ర చర్చలకు దారి తీశాయి. హీరో సాయి తేజ్ దీన్ని <<13584609>>బయటపెట్టడంతో<<>> సీఎం రేవంత్ ఆదేశాలతో HYD పోలీసులు ప్రణీత్‌పై కేసు నమోదు చేశారు.
Similar News
News December 2, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 2, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 2, 2025
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: YCP

AP: CBN ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో అవి కొండల్లా పేరుకుపోతున్నాయని YCP ఆరోపించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా నిధులు పేరుకుపోయాయని విమర్శించింది. ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద రూ.5,600కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.2,200కోట్లు బకాయిలున్నట్లు తెలిపింది. దీంతో విద్యార్థులకు చదువుతో పాటు భోజనం కూడా దక్కని పరిస్థితి నెలకొందని ట్వీట్ చేసింది.
News December 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


