News June 6, 2024

BREAKING: వైఎస్ జగన్ కీలక భేటీ

image

AP: ఎన్నికల్లో ఘోర ఓటమిపై వైఎస్ జగన్ పోస్ట్‌మార్టం మొదలుపెట్టారు. తాడేపల్లిలోని నివాసంలో ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో పాటు ఓడిన నేతలతోనూ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలు, ఓట్లు తగ్గడంపై వారితో చర్చిస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాశ్ సహా పలువురు ఓటమికి గల కారణాలను జగన్‌కు వివరించారు.

Similar News

News November 19, 2025

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

image

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్‌మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?

News November 19, 2025

రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

image

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.

News November 19, 2025

గ్రేటర్ తిరుపతి ఇలా..!

image

తిరుపతి కార్పొరేషన్‌ విస్తరణలో భాగంగా 63 గ్రామాలు విలీనం కానున్నాయి. తిరుపతి రూరల్ మొత్తం కార్పొరేషన్‌లో కలిపేస్తారు. చంద్రగిరి మండలంలోని 21 గ్రామాల్లో 13 గ్రేటర్‌లో కలుస్తాయి. విలీనంతో నగర జనాభా 4.52 లక్షల నుంచి 7.86 లక్షలకు చేరనుంది. ఆదాయం సైతం రూ.149 కోట్ల నుంచి రూ.192.20 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం తిరుపతి విస్తీర్ణం 30.174 చ.కిమీ ఉండగా విలీనంతో 300.404 చ.కిమీకు పెరగనుంది.