News November 20, 2024
BREAKING: ఆదోని పెద్ద వంకలో మృతదేహం
ఆదోనిలోని బార్ పేటలో ఉన్న పెద్ద వంకలో బుధవారం ఉదయం గుర్తుతెలియని పురుష మృతదేహం ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున శవాన్ని చూసిన ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పక్కనే ఓ చిన్నపాటి కత్తి ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై 3వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 21, 2024
ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు
కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
News November 21, 2024
శ్రీశైలంలో సాంప్రదాయ బద్ధంగా ఆకాశదీపం పూజలు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో గురువారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆకాశదీపం వెలిగించారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఆలయంలో ఆకాశ దీపానికి వేద పండితులు పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అర్చకులు పూజ నిర్వహించి కార్తీకదీపం ఏర్పాటు చేశారు.
News November 21, 2024
మండలి ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించిన బీటీ నాయుడు
టీడీపీ శాసనమండలి ఉపనాయకుడు బీటీ నాయుడు మండలి సమావేశం సందర్భంగా గురువారం శాసనమండలిలో ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించారు. సభను సజావుగా నడిపించారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేశామన్నారు. బీటీ నాయుడు మండలి సమావేశంలో హుందాగా సభను నిర్వహించి సభ్యుల మన్ననలు పొందారు.