News April 1, 2025

BREAKING: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం

image

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. గుర్రంపోడులో ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండాగా వద్దిరెడ్డిగూడెం వద్ద కాన్వాయ్‌లో గన్‌మెన్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలగా మంటలు చెలరేగాయి. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 3, 2025

సంగారెడ్డి జిల్లాలో కుళ్లిన శవం లభ్యం

image

సంగారెడ్డి జిల్లాలో కుళ్లిపోయిన శవం కలకలం రేపుతోంది. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులో గురువారం గుర్తుతెలియని వ్యక్తి శవం దొరికిందని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. గుర్తుపట్టలేకుండా మృతదేహం కుళ్లిపోయిందని, అతడి వయసు 30- 40 ఏళ్లు మధ్య ఉండి, పైన బ్లూ కలర్ డ్రాయర్ ఉందన్నారు. మృతుడి గురించి ఎవరికైనా తెలిస్తే ఇంద్రకరణ్ ఎస్ఐ నంబర్ 8712656747, సంగారెడ్డి రూరల్ సీఐ నంబర్ 87126 56719 కు సంప్రదించాలన్నారు.

News April 3, 2025

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి: వెంకటయ్య

image

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి సాధించిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ R&B గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై అశ్రద్ధవహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు.

News April 3, 2025

వైఎస్ సునీత ప్రాణాలకు ముప్పు.. షర్మిల సంచలన ఆరోపణలు

image

AP: వివేకా హత్య కేసు నిందితులు ఆయన కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉందని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఎంపీ అవినాశ్ బెయిల్‌పై ఉన్నందునే ఆమెకు న్యాయం జరగట్లేదన్నారు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇలాగైతే న్యాయం ఎప్పుడు జరుగుతుందని న్యాయస్థానాలను ప్రశ్నించారు.

error: Content is protected !!