News March 1, 2025

BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.

Similar News

News March 3, 2025

శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు డీఈవో

image

సీ.బెలగల్ మండలం పోలకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి శ్రీలేఖ కర్నూలులో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరులో జరిగిన విద్యార్థిని అంత్యక్రియలలో ఈడీవో శ్యామ్యూల్ పాల్ పాల్గొని, పాడెమోశారు. అంత్యక్రియలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. కాగా, సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో విద్యార్థినిపై చెట్టు విరిగిపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

News March 3, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 3, 2025

ఆళ్లగడ్డ: సైబర్ నేరగాళ్ల వలలో ప్రైవేటు ఉద్యోగి

image

అధిక డబ్బులకు ఆశపడి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.72,000 పోగొట్టుకున్న ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. రాజేశ్ నాయక్ అనే వ్యక్తి పట్టణంలో టాటా కంపెనీలో లోన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. టెలిగ్రామ్‌లో సైబర్ నేరగాళ్లు అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపి బురిడీ కొట్టించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆదివారం పట్టణ ఎస్ఐ నగీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

error: Content is protected !!