News April 14, 2025
BREAKING.. కుషాయిగూడలో మర్డర్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 20, 2025
నేను రేవంత్‌తో ఫుట్‌బాల్ ఆడుతా: KTR

TG: సీఎం రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుతారో తనకు తెలియదని తాను మాత్రం రేవంత్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రేవంత్‌లా నేను ఫ్యామిలీ విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. కాంగ్రెస్ సర్కార్‌కు హనీమూన్ ముగిసింది. ఇక KCR ప్రజల్లోకి వస్తారు. రేవంత్ చెబుతున్న <<18605125>>66%<<>> విజయం నిజమైతే, ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికకు రావాలి’ అని చిట్ చాట్‌లో సవాల్ చేశారు.
News December 20, 2025
జగిత్యాల: ప్రమాదాల నివారణకు ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం సంబంధిత అధికారులను ఆదేశించారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణకై తీసుకోవలసిన చర్యలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. రహదారులపై సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2026 జనవరిలో చేపట్టనున్న రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణకు శాఖల వారీగా కార్యాచరణ తయారు చేయాలన్నారు.
News December 20, 2025
DMart ఫేక్ యాడ్.. ‘మహాభారత్’ నటుడి అకౌంట్ ఖాళీ!

మహాభారత్ సీరియల్‌లో ‘యుధిష్ఠిరుడు’ గజేంద్ర చౌహాన్ సైబర్ మోసానికి గురయ్యారు. FBలో DMart పేరుతో వచ్చిన ఫేక్ యాడ్ చూసి ఆయన డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. లింక్ నొక్కి OTP ఎంటర్ చేయగానే అకౌంట్ నుంచి ₹98,000 కట్ అయ్యాయి. ఆయన ఫిర్యాదుతో వెంటనే స్పందించిన ముంబై పోలీసులు డబ్బును రికవర్ చేశారు. ఆన్‌లైన్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.


