News April 14, 2025
BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.
Similar News
News April 16, 2025
అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
News April 16, 2025
ఓల్డ్ పాస్‌బుక్ అతడి జీవితాన్నే మార్చేసింది!

ఇల్లు క్లీన్ చేస్తుంటే దొరికిన ఓ పాత బ్యాంక్ పాస్ బుక్ ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. చిలీకి చెందిన ఎక్సెక్వియల్ హినోజోసాకి ఇంట్లో 60 ఏళ్ల క్రితంనాటి తన తండ్రి బ్యాంక్ పాస్‌బుక్ లభించగా అందులో రూ.1.4 లక్షలు జమ చేసినట్లు ఉంది. అందులో బ్యాంకు దివాలా తీస్తే ఆ డబ్బు ప్రభుత్వం ఇస్తుందని తెలిసి అధికారులను కలవగా వారు నిరాకరించారు. న్యాయపోరాటంలో వడ్డీతో రూ.10.27 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
News April 16, 2025
కంది: డీఎస్సీ-2008 ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు

జిల్లాలో డీఎస్సీ-2008 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 63 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ, మండల పరిషత్ యాజమాన్యంలో ఫిబ్రవరి నెలలో నియామకం అయ్యారని వీరందరికీ ట్రెజరీ ద్వారానే జీతాలు అందనున్నాయని పేర్కొన్నారు.