News February 4, 2025
BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 4, 2025
GWL: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య (60) విద్యుత్ బల్బు పెడుతుండగా అకస్మాత్తుగా షాక్ తగిలి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 4, 2025
జనగామ: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 100 రోజుల ఉచిత శిక్షణ
ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్.ఎంపీవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 9తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు.
News February 4, 2025
‘దీపం పథకం 2 పటిష్ఠంగా అమలు చేయండి’
దీపం పథకం-2 పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని కోర్ట్ హాల్‌లో పుట్టపర్తి పరిధిలోని గ్యాస్ ఏజెంట్స్ ప్రతినిధులతో దీపం పథకం-2 సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో అర్హులైన పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.