News April 14, 2025

BREAKING: పటాన్‌చెరు: రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

image

పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను రోకలిబండతో కొట్టి భర్త రమేష్ హతమార్చాడు. భార్య భర్తల మధ్య గొడవ జరగగా అడ్డువచ్చిన అత్త కవితపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా..అత్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 25, 2025

వరంగల్ జిల్లాలో ఈరోజు HEAD LINES

image

✓వరంగల్ కమిషనరేట్లో విస్తృతంగా తనిఖీలు
✓WGL: క్వింటా పత్తి ధర రూ.7,700
✓సంగెం మండలంలో పర్యటించిన పరకాల MLA రేవూరి
✓భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న MLC కవిత
✓నల్లబెల్లి: గొర్రెలు, మేకలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
✓11వ రోజుకు చేరిన తూర్పు జర్నలిస్టుల దీక్ష
✓WRPT: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన MLA నాగరాజు
✓ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని పలుచోట్ల ర్యాలీలు

News April 25, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞టెన్త్ టాపర్ ఆదిల్‌కు DEO అభినందన☞శోభనాగిరెడ్డి వర్ధంతి వేడుకల్లో భావోద్వేగానికి గురైన భూమా మౌనిక☞మిస్ యూ అమ్మా.. MLA భూమా అఖిలప్రియ ఎమోషనల్.!☞రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు: జేసీ☞పహాల్గమ్ ఉగ్రదాడిని నిరసిస్తూ నంద్యాలలో ర్యాలీ☞ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: మన్నే☞బ్రేకులు ఫెయిల్.. శ్రీశైలం ఘాట్‌లో ప్రమాదం.

News April 25, 2025

భయపడుతున్న పాకిస్థాన్?

image

పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత్ ఏ క్షణమైనా తమపై విరుచుకుపడొచ్చని పాకిస్థాన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది. లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది. దీంతో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ‘PAF హెర్క్యులస్’ ద్వారా పెద్దఎత్తున తరలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

error: Content is protected !!