News August 13, 2024
BREAKING: రాయలసీమ రేంజ్‌లో భారీగా సీఐల బదిలీ
రాయలసీమ రేంజ్ పరిధిలో ఒకేసారి 62మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 18 మంది సీఐలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా మరోవైపు ఇప్పటికే వీఆర్‌లో ఉన్న 15 సీఐలకు పోస్టింగ్ లభించింది. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఐలను డీఐజీ డా.కోయ ప్రవీణ్ నియమించారు.
Similar News
News January 22, 2025
ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఆదోని ఎమ్మెల్యే!
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. సుమారు 10 మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రేసులో ముందున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
News January 22, 2025
ఘోర ప్రమాదం.. మంత్రాలయం విద్యార్థుల మృతి
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు <<15220489>>చెందిన<<>> ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ముగ్గురు మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్రగా గుర్తించారు. డ్రైవర్ శివ కూడా ప్రాణాలు కోల్పోయారు. నరహరితీర్థుల ఆరాధనోత్సవాలకు 14 మంది విద్యార్థులు మంత్రాలయం నుంచి హంపీకి బయలుదేరగా తుఫాన్ వాహనం బోల్తా పడి ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 22, 2025
నకిలీ హాల్ టికెట్‌తో అడ్డంగా దొరికిపోయాడు!
కర్నూలులో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో ఓ యువకుడు నకిలీ హాల్ టికెట్ సృష్టించి దొరికిపోయాడు. కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన తిరుమల ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిలయ్యాడు. అర్హుడైనట్లు నకిలీ హాల్ టికెట్ సృష్టించి 1,600M పరుగులో పాల్గొనేందుకు వచ్చాడు. ఇదివరకే ఫెయిలయిన వివరాలు కంప్యూటర్‌లో నమోదు కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.