News June 10, 2024

BREAKING: సికింద్రాబాద్ మహంకాళి బోనాల తేదీల ప్రకటన

image

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తేదీలను దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, అర్చకులు సోమవారం వెల్లడించారు. జులై 7న ఘటోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జులై 21న బోనాలు.. 22న భవిష్యవాణి (రంగం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. SHARE IT

Similar News

News January 16, 2025

శంకర్‌పల్లి: మరకత శివాలయానికి హంపి పీఠాధిపతి

image

శంకర్‌పల్లి మండలం చందిప్పలోని 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి ఫిబ్రవరి 5న హంపి పీఠాధిపతి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి రానున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News January 16, 2025

నార్సింగి జంట హత్యల్లో మరో ట్విస్ట్

image

పుప్పాలగూడలో <<15160567>>జంటహత్యలు<<>> నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. క్రైమ్ స్పాట్‌లో వారి ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై రాయితో కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 11న మర్డర్లు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బిందుతో సాకేత్ వ్యభిచారం చేపించినట్లు తెలిసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వీరిని హత్య చేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నట్లు సమాచారం.

News January 16, 2025

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

image

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. చందనవెల్లి 14.3℃, రెడ్డిపల్లె 14.7, తాళ్లపల్లి 15, కాసులాబాద్ 15.2, కేతిరెడ్డిపల్లి, షాబాద్, ధర్మసాగర్ 15.5, కందువాడ 15.7, మొగలిగిద్ద 15.9, ఎలిమినేడు 16.1, తొమ్మిదిరేకుల, వెల్జాల, షాద్‌నగర్ 16.3, రాచలూరు 16.4, ప్రొద్దుటూరు, అమీర్‌పేట్, మంగళ్‌పల్లి 16.6, రాజేంద్రనగర్ 16.7, నందిగామ 16.8, సంగం, మొయినాబాద్ 16.9, శంకర్పల్లి 17, HCUలో 17.1గా నమోదైంది.