News July 26, 2024
రొమ్ము క్యాన్సర్: ఇంట్లోనే ఇలా గుర్తించండి

భారత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉంది. ICMR అంచనాల ప్రకారం 2022లో దేశంలో 2,16,108 బ్రెస్ట్ క్యాన్సర్ కేసులున్నాయి. అయితే దీనిని ఇంటి వద్దే గుర్తించొచ్చంటున్నారు వైద్య నిపుణులు. ‘అద్దం ముందు నిల్చుని రొమ్ముల్ని చేతితో క్షుణ్ణంగా పరిశీలించండి. పుళ్లు పడటం, చనుమొనలు స్రవించడం, రొమ్ము, చంకల్లో, చనుమొనల వెనుక గడ్డలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి’ అని సూచిస్తున్నారు.
Similar News
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
News December 3, 2025
ఏపీ టెట్ హాల్టికెట్లు విడుదల

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <
News December 3, 2025
క్విక్-C-వార్: మర్చిపోయారా..! మరేం పర్లేదు!!

క్విక్ కామర్స్ కంపెనీల పోటీ యుద్ధంతో కస్టమర్లకు మరో కొత్త బెనిఫిట్ రాబోతోంది. Blinkit ‘యాడ్ ఐటమ్స్ ఆఫ్టర్ ఆర్డరింగ్’ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో వస్తువులు ఆర్డర్ చేశాక అది ప్యాకింగ్ స్టేజ్లో ఉంటే మరికొన్ని యాడ్ చేయొచ్చు. క్విక్ మార్కెట్ వాటా పెంచుకునేందుకు ఇప్పటికే జెప్టో ప్రాసెసింగ్, డెలివరీ ఛార్జెస్ తొలగించింది. స్విగ్గీ మ్యాక్స్ సేవర్, ప్రైస్ డ్రాప్ వంటి ఆఫర్స్ తీసుకొచ్చింది.


