News July 28, 2024
AIతో ఐదేళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ గుర్తింపు

క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడంలో AI ఉపకరిస్తుందంటున్నారు హంగరీ పరిశోధకులు. మామోగ్రామ్ నివేదికల నుంచి రొమ్ము క్యాన్సర్ ముప్పును తమ ఏఐ అల్గారిథం ఐదేళ్ల ముందుగా కనిపెట్టిందని వారు తెలిపారు. 50-69 ఏళ్ల వయసున్నవారిపై అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. మున్ముందు మనుషులకు కృత్రిమ మేధ మరింత కీలకమవనుందని ఆయన జోస్యం చెప్పారు.
Similar News
News January 18, 2026
X యూజర్లకు మస్క్ ₹9 కోట్ల ఆఫర్!

ఎలాన్ మస్క్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ‘X’లో అత్యుత్తమంగా నిలిచే ఒక లాంగ్ ఫామ్ ఆర్టికల్‌కు ఏకంగా $1M (సుమారు ₹9 కోట్లు) బహుమతి ఇస్తామన్నారు. క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ కనీసం 1,000 పదాలు ఉండాలి. కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. AI వాడొద్దు. ప్రస్తుతానికి ఈ పోటీ జనవరి 28 వరకు అమెరికాలోని ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
News January 18, 2026
ట్విస్ట్ అంటే ఇది.. BJPకి షిండే షాక్ ఇస్తారా?

BMC ఫలితాల్లో ఏ సింగిల్ పార్టీకీ మెజారిటీ లేదు. 29 సీట్లు గెలిచిన మహాయుతిలోని షిండే సేన ఇప్పుడు కింగ్‌మేకర్‌గా మారింది. దీంతో మేయర్ పీఠమే లక్ష్యంగా ఆయన తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలించారు. 114 మార్కు చేరాలంటే BJPకి షిండే సపోర్ట్ తప్పనిసరి. ప్రతిపక్షాలన్నీ కలిస్తే మెజారిటీకి 8 సీట్ల దూరంలోనే ఉన్నాయి. అందుకే హార్స్ ట్రేడింగ్ జరగకుండా, మేయర్ పీఠంపై గురితో షిండే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
News January 18, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మరికొన్ని చోట్ల రూ.300పైనే కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ.300-320గా ఉంది. గుంటూరు, విశాఖలో రూ.300, నంద్యాల రూ.260-300, కామారెడ్డిలో రూ.300-310, కర్నూలులో రూ.310-320కి విక్రయిస్తున్నారు. అమలాపురంలో రూ.250 నుంచి రూ.300కి పెరిగింది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


