News January 24, 2025

BREKING: రూ.1,000 కోసం రెండు హత్యలు

image

ఇద్దరి స్నేహితులను హత్య చేసిన మరో ఇద్దరు స్నేహితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక హత్య కేసు శోధిస్తుంటే మరో హత్య కేసు బయటపడిందని, కేవలం రూ.వెయ్యి కోసం ఈ హత్యలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు బహదూర్, యూసుఫ్ అనే మిత్రులను హత్య చేసిన అమర్ ఖాన్, రియాజ్ ఖాన్‌లను సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు వివరించారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

మంచిర్యాలలో విషాదం

image

మంచిర్యాలలోని ఏసీసీ సిమెంట్ కంపెనీ సమీపంలో సోమవారం రాత్రి రైలు కింద పడి సాగె శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన శ్రీనివాస్ ఏసీసీలో ఇంటర్‌నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. పిల్లలు పుట్టడం లేదని బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ తెలిపారు.

News December 9, 2025

ఇండిగోపై చర్యలు తీసుకుంటాం: రామ్మోహన్ నాయుడు

image

ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ‘ఇండిగో సంక్షోభంపై విచారణకు ఆదేశించాం. ప్రయాణికుల ఇబ్బందికి యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ప్రయాణికుల భద్రతే ముఖ్యం. ఇప్పటికే DGCA నోటీసులు జారీ చేసింది. జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత ఇండిగోపై ఉంది. DGCA రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయి. కొత్త నిబంధనలు పాటిస్తామని ఇండిగో వివరణ ఇచ్చింది.’ అని తెలిపారు.

News December 9, 2025

రిజర్వేషన్ లేకుండా AC కోచ్‌లో ప్రయాణించవచ్చా?

image

జనరల్, స్లీపర్ క్లాస్ టికెట్‌తో కూడా AC కోచ్‌లలో ప్రయాణించవచ్చని కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారతీయ రైల్వే మండిపడింది. ఇలాంటివి నమ్మొద్దని స్పష్టం చేసింది. ‘రిజర్వేషన్ లేకపోయినా రూ.250 ఫైన్ చెల్లించి ACలో వెళ్లొచ్చనేది తప్పు. దీనివల్ల రైల్వేకు నష్టం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. సరైన టికెట్‌తోనే ప్రయాణించాలి’ అని సూచించింది.