News January 24, 2025
BREKING: రూ.1,000 కోసం రెండు హత్యలు

ఇద్దరి స్నేహితులను హత్య చేసిన మరో ఇద్దరు స్నేహితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక హత్య కేసు శోధిస్తుంటే మరో హత్య కేసు బయటపడిందని, కేవలం రూ.వెయ్యి కోసం ఈ హత్యలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు బహదూర్, యూసుఫ్ అనే మిత్రులను హత్య చేసిన అమర్ ఖాన్, రియాజ్ ఖాన్‌లను సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు వివరించారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
ప్రియుడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్యా రాజేశ్

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లికి అండగా ఉండేందుకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసినట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఓ వ్యక్తిని ఇష్టపడినట్లు తెలిపారు. తర్వాత అతడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లవ్ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయమన్నారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు.
News February 13, 2025
రాష్ట్రపతి పాలనలో మణిపుర్ రికార్డు

అత్యధికసార్లు(11) రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపుర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో UP(10), J&K(9) బిహార్(8), పంజాబ్(8) ఉన్నాయి. రోజుల(4,668) పరంగా J&K టాప్‌లో ఉంది. ఆ తర్వాత పంజాబ్(3,878), పాండిచ్చేరి(2,739) ఉన్నాయి. 1951లో తొలిసారిగా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి 29 రాష్ట్రాలు/UTలలో 134సార్లు విధించారు. TG, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కసారీ ప్రెసిడెంట్ రూల్ రాలేదు.
News February 13, 2025
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు

AP: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టూ అందుబాటులోకి తేవాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని సూచించారు.