News September 9, 2025
బ్రెవిస్ జాక్‌పాట్.. ఏకంగా రూ.8 కోట్లు

సౌతాఫ్రికా క్రికెటర్ బ్రెవిస్ జాక్‌పాట్ కొట్టారు. SA20 సీజన్ 4 వేలంలో అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ.8.30 కోట్లకు దక్కించుకుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. బేబీ ఏబీగా గుర్తింపు పొందిన బ్రెవిస్ ప్రస్తుతం IPLలో చెన్నై తరఫున ఆడుతున్నారు. నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఈ చిచ్చర పిడుగు దిట్ట. అటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్‌ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7 కోట్లకు దక్కించుకుంది.
Similar News
News March 3, 2026
‘హెడ్’ పోయినా పోరాడుతోంది!

సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినా యుద్ధంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్‌కు దీటుగా బదులిస్తూ వాటికి సహకరించిన గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఈ పని అంతా ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ విభాగంలోని ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) చేస్తోంది. ఇందులో సుమారు 1.50 లక్షల మంది సైన్యం ఉంటుంది. అల్టిమేట్‌గా ఖమేనీ దీనికి హెడ్‌గా ఉండేవారు. IRGC కమాండర్ ఇన్ చీఫ్ కూడా హతమయ్యారు.
News March 3, 2026
ఈ ఎర పంటలతో ఈ ప్రధాన పంటల్లో పురుగుల నియంత్రణ

☛ బత్తాయి పంట చుట్టూ టమాటాను సాగు చేసి పండు రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ☛ పసుపు చుట్టూ ఆముదం పంట నాటి కొమ్మ, కాయ తొలుచు పురుగులను ☛ తీగజాతి కూరగాయల పంటల చుట్టూ మొక్కజొన్నను సాగు చేసి పండు ఈగల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ టమాటా చుట్టూ బంతి/దోసను సాగు చేసి కాయతొలుచు పురుగులు/తెల్లదోమలను.. బంగాళాదుంప పంట చుట్టూ వంకాయ మొక్కలను నాటి అక్షింతల పురుగులను కట్టడి చేయవచ్చు.
News March 3, 2026
ఇవాళ స్టాక్ మార్కెట్లకు సెలవు

హోలీ పండగ నేపథ్యంలో ఈరోజు స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు సెలవు ఉంటుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE) మళ్లీ రేపు తెరుచుకుంటాయి. దీంతో ఇవాళ ఈక్విటీ, సెక్యూరిటీస్ ట్రేడింగ్ ఉండదు. ఇక MCX మార్కెట్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రా.11.30 వరకు కొనసాగుతుంది. ఇక ఈనెలలో శ్రీరామనవమి (మార్చి 26), మహావీర్ జయంతి (మార్చి 31) రోజుల్లో కూడా మార్కెట్ క్లోజ్ ఉంటుంది.


