News October 27, 2025
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.40వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. అతడు అయ్యప్ప దీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Similar News
News February 9, 2026
చర్మాన్ని మెరిపించే జ్యూసులు

చలికాలంలో చర్మం పొడిబారడం, కాంతి కోల్పోవడం సాధారణం. దీని కోసం ఖరీదైన క్రీములు వాడటం కంటే.. లోపల నుంచి పోషణ అందించడం ద్వారా సహజ సౌందర్యాన్ని పెంచుకోవడం మంచిది. దీనికోసం క్యారెట్ జ్యూస్, టొమాటో జ్యూస్, బీట్‌రూట్ జ్యూస్, దోసకాయ జ్యూస్, పాలకూర- గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుందంటున్నారు నిపుణులు. వీటిల్లో పసుపు, అల్లం వంటివి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు యాడ్ చేయడం మంచిదంటున్నారు.
News February 9, 2026
‘పార్లమెంటులో పేలుడు జరుగుతుంది’.. స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని 10కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 8.33AMకి తొలి కాల్ వచ్చిందని, స్కూళ్లను అలర్ట్ చేసి విద్యార్థులను పంపించామని ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఢిల్లీ ఖలిస్థాన్ అవుతుంది. పంజాబే ఖలిస్థాన్. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం. ఫిబ్రవరి 13న 1.11PMకు పార్లమెంటులో పేలుడు జరుగుతుంది’ అని ఈమెయిల్‌లో దుండగులు హెచ్చరించారు.
News February 9, 2026
పబ్‌జీ ఆడుతుండగా 300 దాటిన BP.. మెదడు నరాలు చిట్లి మృతి

మేరఠ్(UP)కు చెందిన మహ్మద్ కైఫ్(22) 4నెలలుగా PUBG గేమ్‌కు అలవాటుపడ్డారు. శుక్రవారం హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆడుతూనే ఉన్నారు. ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చెవులు, ముక్కు నుంచి రక్తం కారిన అతనికి ట్రీట్‌మెంట్ చేసినా ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మెంటల్ ప్రెజర్‌తో BP 300 దాటి బ్రెయిన్‌లోని నరాలు చిట్లి రక్తస్రావమైనట్లు డాక్టర్లు తేల్చారు.


