News October 22, 2024
BRICS శత్రు కూటమేమీ కాదు: అమెరికా

సంయుక్త లక్ష్యాలను సాధించేందుకు అనేక దేశాలతో US కలిసి పనిచేస్తుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరిన్ జీన్ పియరీ అన్నారు. BRICSను తాము జియో పొలిటికల్ రైవల్‌గా చూడటం లేదని పేర్కొన్నారు. భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. PM మోదీ సైతం ‘బ్రిక్స్ యాంటీ వెస్ట్రన్ కూటమి కాదు, నాన్ వెస్ట్రన్ కూటమి మాత్రమే’ అని అభిప్రాయపడటం తెలిసిందే. G7తో పోలిస్తే BRICS బలంగా మారింది.
Similar News
News November 14, 2025
MGB సీఎం అభ్యర్థి తేజస్వీ వెనుకంజ

ఆర్జేడీ కీలక నేత, MGB సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్ నుంచి పోటీ చేసిన ఆయన 3,000 ఓట్లతో వెనుకపడ్డారు. 4వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌కు 17,599 ఓట్లు రాగా, తేజస్వీకి 14,583 ఓట్లు వచ్చాయి. ఇంకా 26 రౌండ్లు ఉన్నాయి.
News November 14, 2025
15వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వరుసగా 6 రౌండ్లలో నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆయన 15,589 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు ఆయన ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: TPCC చీఫ్

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. మెజారిటీ ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం ప్రభావం చూపుతోందన్నారు. BRS డైవర్షన్ పాలిటిక్స్ చేసిందని, మహిళల సెంటిమెంట్‌ను వాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అయినా ప్రజలు అభివృద్ధి కోసం ఆలోచించారని, ఈ ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.


