News October 22, 2024
BRICS SIDELINES: మోదీ, జిన్పింగ్ భేటీ కాబోతున్నారా!

BRICS సదస్సు కోసం రష్యా వెళ్లిన PM నరేంద్ర మోదీతో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఇప్పటికే దీనిపై హింట్ ఇవ్వడం గమనార్హం. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టామన్నారు. గల్వాన్ లోయలో 2 దేశాల సైనికుల బాహాబాహీ తర్వాత జిన్పింగ్ను కలిసేందుకు మోదీ ఆసక్తి చూపలేదు. నిన్ననే LAC వద్ద డిస్ఎంగేజ్మెంట్ ఫైనలైజ్ అవ్వడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Similar News
News November 18, 2025
మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

AP: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.