News May 1, 2024
ప్రజ్వల్‌ను రప్పించండి.. మోదీకి సిద్దరామయ్య లేఖ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను విదేశం నుంచి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య లేఖ రాశారు. ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ రద్దుకు ఆదేశించాలని కోరారు. కాగా హసన్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్.. ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రాగానే అతడు జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Similar News
News January 12, 2025
నేడు అరకు లోయకు సుప్రీంకోర్టు జడ్జిలు
AP: సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నాతో సహా 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకులోయలో పర్యటించనుంది. వీరంతా విశాఖపట్నం నుంచి రైలులో ఉదయం 10.30 గంటలకు అరకు లోయకు చేరుకోనున్నారు. గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం బొర్రా గుహలను సందర్శించనున్నారు. వీరి రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
News January 12, 2025
గ్రేటర్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్: సీఎం రేవంత్
TG: గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ విధానం ఉండాలని సూచించారు. ఇతర దేశాల్లో బెస్ట్ విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చూడాలన్నారు.
News January 12, 2025
కేజ్రీవాల్‌కు అమిత్ షా కౌంటర్
రమేశ్ బిధూరీని బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కేజ్రీవాల్ నిర్ణయిస్తారా? అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆయన ఎవరు?’ అని షా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రమేశ్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.