News August 8, 2024

NCP మొత్తాన్ని తీసుకొచ్చేవాడిని: అజిత్ పవార్

image

బీజేపీ, శివ‌సేన త‌న‌కు CM ప‌ద‌వి ఆఫ‌ర్ చేసుంటే మొత్తం NCPని త‌న‌వెంట‌ తీసుకొచ్చేవాడిన‌ని మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వ్యాఖ్యానించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే బ‌యోగ్ర‌ఫీ విడుద‌ల సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో తాను ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కంటే సీనియ‌ర్‌ అని చెప్పుకొచ్చారు.

Similar News

News December 5, 2025

హిమాచల్‌ప్రదేశ్ సీఎంని ఆహ్వానించిన మంత్రి అడ్లూరి

image

ఈనెల8,9 తేదీలలో జరగనున్న తెలంగాణ రెజ్లింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకిందర్ సింగ్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. శుక్రవారం మంత్రి స్వయంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి సీఎంని ఆహ్వానించారు. అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ఇరువురు ముచ్చటించుకున్నారు. సీఎం స్పందించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.

News December 5, 2025

కులాల కుంపట్లలో పార్టీలు.. యువతా మేలుకో!

image

తెలంగాణ పోరులో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిమితమైతే శ్రీకాంతాచారి సహా ఎంతో మంది సామాన్యులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు BC రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల కుంపట్లను రాజేసి చలికాచుకునే పనిలో అన్నిపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరాచారి <<18478689>>ఆత్మహత్యే<<>> ఇందుకు నిదర్శనం. అవకాశవాద నాయకుల ఉచ్చులో పడకుండా యువత సంయమనం పాటించాలి. డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయండి.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.

News December 5, 2025

₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి TTDకి ₹14 కోట్లు ఎలా కట్టాడు జగన్?: పల్లా

image

AP: TTD పరకామణి చోరీపై YCP చీఫ్ జగన్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ‘చిన్న చోరీయే. పోయింది ₹72 వేలే’ అని అనడంపై TDP మండిపడుతోంది. ₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి తిరిగి TTDకి ₹14CR ఎలా కట్టగలిగాడు? తీసుకోవడానికి సుబ్బారెడ్డి ఎవరు? దొంగిలించిన దానికి అదనంగా డబ్బిస్తే కేసు మాఫీ అవుతుందా? CBIకి ₹70 వేల కోట్లిస్తే మీ కేసులూ మాఫీ చేసేయొచ్చా జగన్!’ అని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.