News April 25, 2024
అక్రమ వలసలకు చెక్.. ‘రువాండా’ బిల్‌కు బ్రిటన్ ఆమోదం

అక్రమ వలసదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రిటన్.. వివాదాస్పద ‘సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్’కు ఆమోదం తెలిపింది. బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది. ఇకపై అక్రమంగా ప్రవేశించేవారు దేశంలో ఉండేందుకు వీలుండదు. వారిని ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తారు. వలసదారులను దోపిడీ చేసే క్రిమినల్స్ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆ దేశ PM రిషి సునాక్ తెలిపారు. ఇదో గొప్ప మైలురాయని పేర్కొన్నారు.
Similar News
News September 13, 2025
SMకు దూరంగా ఉంటా.. మరో హీరోయిన్ ప్రకటన

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘సోషల్ మీడియా నా పనిపై, ఆలోచనలపై దృష్టి పెట్టకుండా చేస్తోంది. నా సృజనాత్మకతను దెబ్బతీసింది. నాలోని కళాకారిణిని, నన్ను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. అయినా నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెడతా’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. <<17686001>>అనుష్క<<>> కూడా SMకు దూరంగా ఉంటానని ఇటీవల ప్రకటించింది.
News September 13, 2025
KTRకు రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా: మహేశ్

TG: ఫిరాయింపు MLAల విషయంలో రాహుల్‌గాంధీని KTR <<17689238>>ప్రశ్నించడంపై<<>> TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఫైరయ్యారు. ‘MLAలపై రాహుల్ ఎందుకు మాట్లాడాలి? KTR స్థాయి ఏంటి? రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కాళేశ్వరంపై విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారు. BJPలో BRS విలీనం గురించి ఇప్పటికే కవిత చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.
News September 13, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలలోపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నల్గొండ, సిద్దిపేటలో వాన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది.