News May 12, 2024

యూటీఐ సమస్యకు బ్రిటన్ పరిశోధకుల వ్యాక్సిన్

image

మూత్రనాళ ఇన్ఫెక్షన్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటుంది. ప్రధానంగా స్త్రీలను వేధించే ఈ సమస్యకు ఇంగ్లండ్‌లోని బర్క్‌షైర్ పరిశోధకులు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. యూరోమ్యూన్ అనే టీకాను వారు రూపొందించారు. దీన్ని నాలిక కింద స్ప్రే చేస్తే, శరీరంలోని 88 రకాల బ్యాక్టీరియాలపై పోరాడుతుందని వారు వివరించారు. ప్రయోగాల్లో భాగంగా టీకా తీసుకున్న వారిలో 9ఏళ్ల పాటు ఏ ఇన్ఫెక్షన్ రాలేదని వెల్లడించారు.

Similar News

News February 15, 2026

CNF అంటే ఏంటో తెలుసా?

image

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It

News February 15, 2026

సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

image

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

News February 15, 2026

నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

image

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.