News April 9, 2025
బ్రిటన్ యువరాజు ప్రాణాలకు ముప్పు: లాయర్

బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది ఫాతిమా లండన్ కోర్టుకు తెలిపారు. హ్యారీ తన భార్యతో కలిసి 2020లో అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన బ్రిటన్ వచ్చినప్పుడు కల్పించే భద్రతను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హ్యారీ కోర్టును ఆశ్రయించారు. ‘హ్యారీని చంపాలంటూ ఆల్ ఖైదా ఈమధ్యే పిలుపునిచ్చింది. ఇక ఆయన్ను, ఆయన భార్యను మీడియా డేగలా వెంటాడుతోంది’ అని ఫాతిమా వివరించారు.
Similar News
News April 17, 2025
ఏ క్షణమైనా ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను ఇవాళ విడుదల చేస్తామని NTA ప్రకటించిన విషయం తెలిసిందే. రాత్రిలోపు ఏ క్షణమైనా ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో పరీక్షకు హాజరైన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. మీరూ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారా?
News April 17, 2025
కంచ భూములు ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదు: టీపీసీసీ చీఫ్

TG: కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేటు పరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో KTR ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. BRS హయాంలో HYD చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని విమర్శించారు. గతంలో చాలా సార్లు BRSకు కోర్టుల చేతిలో మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. కోర్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు.
News April 17, 2025
25న ‘గురుకుల’ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

AP: గురుకుల స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరగనుంది. గురుకుల విద్యాలయాల సంస్థ అభ్యర్థుల హాల్‌టికెట్లను ఇవాళ విడుదల చేసింది. <