News May 5, 2024

మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ విడాకులు

image

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్(42) మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారి(30) నుంచి ఆమె 8 నెలల కిందటే విడిపోగా, తాజాగా లాస్‌ఏంజెలిస్ కోర్టు డివోర్స్ మంజూరు చేసింది. కాగా బ్రిట్నీ 2004లో చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్‌ను పెళ్లాడి ఏడాదికే విడిపోయారు. తర్వాత కెవిన్ ఫెడెర్‌లైన్‌ను వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నారు.

Similar News

News December 26, 2024

పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్

image

TG: అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడంతోనే అరెస్టు చేశారన్న <<14906777>>ప్రచారంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్‌పై ఉంది కదా?’ అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినని రేవంత్ పేర్కొన్నారు.

News December 26, 2024

ఆ కారణం వల్లే మహాత్మాగాంధీ హత్య: సోనియా

image

పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఐకమత్యంగా ముందుకు సాగుదామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ బెలగావి సభలో నేతలకు ఓ సందేశంలో తెలిపారు. ‘స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటమూ చేయని సంస్థలు మహాత్మాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక విషతుల్యమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. వాటి వల్లే ఆయన హత్య జరిగింది. కేంద్రంలో అధికారానికి వచ్చిన వారి వల్ల గాంధీ ఘనత ప్రమాదంలో పడింది’ అన్నారు.

News December 26, 2024

షేక్ హసీనా భవిష్యత్తు ఎటు?

image

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం ఆసక్తికరంగా మారింది. యూనస్ సర్కారు ఆమెను అప్పగించాలని భారత్‌ను అడిగిన నేపథ్యంలో హసీనా పూర్తిగా భారత్‌ దయపై ఆధారపడ్డారు. శరణార్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను భారత్ అప్పగించాల్సి ఉన్నా.. యూనస్‌ భారత వ్యతిరేక వైఖరి కారణంగా హసీనాకు రక్షణ కల్పించేందుకే భారత్ నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.