News December 2, 2024
మండపంలో కూర్చొని కూడా లూడో ఆడుతున్నాడు బ్రో

మూడు ముళ్లు వేసి, భాగస్వామితో ఏడడుగులు వేయాల్సిన సమయంలో కూడా ఓ పెళ్లికొడుకు లూడో ఆడుతూ కనిపించడం వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియకున్నా పెళ్లికొడుకు Just Relaxగా ఉండడంపై అందరూ ఫిదా అవుతున్నారు. ప్రపంచంలో ఏం జరిగినా సరే నువ్వు మాత్రం లూడో ఆడు బ్రో అని ఒకరు, Bro has his own priorities అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మీ సర్కిల్లో ఉన్న లూడో లవర్తో Share This.
Similar News
News November 11, 2025
మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.
News November 11, 2025
రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ

కేంద్ర క్యాబినెట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
News November 11, 2025
దేశంలో భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్: అదానీ

దేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(BESS)ను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. గుజరాత్లోని ఖవ్డాలో నెలకొల్పుతున్న ఇది 2026 మార్చికి పూర్తవుతుందన్నారు. 1126 MW సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతుంది. 3 గంటలపాటు ఏకధాటిగా అంతే స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తుంది. 700 బ్యాటరీ కంటైనర్లను దీనిలో వినియోగిస్తారు. ఇది గ్రిడ్ను 24 గంటల పాటు స్థిరంగా ఉండేలా చూస్తుంది.


