News August 26, 2025
రోహిత్‌ను తప్పించేందుకే బ్రాంకో టెస్ట్: తివారీ

2027 ODI WC నుంచి రోహిత్‌ను తప్పించేందుకే BCCI బ్రాంకో టెస్టును ప్రవేశపెడుతోందని మనోజ్ తివారీ ఆరోపించారు. ‘బ్రాంకో టెస్ట్ చాలా టఫ్. ఇందులో కోహ్లీ అర్హత సాధిస్తారు. కానీ రోహిత్‌తోపాటు మరికొందరికి కష్టమే. 2011WC తర్వాత యోయో పేరుతో యువీ, గౌతీ, సెహ్వాగ్‌ను పక్కనబెట్టినట్లే ఇప్పుడు కొందరిని తప్పించబోతున్నారు’ అని తెలిపారు. బ్రాంకో టెస్టులో ప్లేయర్ 6 నిమిషాల్లోనే 1,200 మీటర్లు పెరిగెత్తాల్సి ఉంటుంది.
Similar News
News August 26, 2025
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. గణేశ్ మండపాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు.
News August 26, 2025
టీమ్ ఇండియా క్రికెటర్లకు రూ.200 కోట్ల నష్టం!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేయడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు రూ.150-200 కోట్లు నష్టపోనున్నారు. డ్రీమ్ 11కు రోహిత్, బుమ్రా, హార్దిక్, కృనాల్, మై 11 సర్కిల్‌కు సిరాజ్, గిల్, జైస్వాల్, MPLకు కోహ్లీ, విన్‌జోకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇందుకు గానూ వీరంతా కలిపి ఏడాదికి రూ.150-200 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ రద్దు కావడంతో వీరికి ఆ మొత్తం నష్టంగా మారనుంది.
News August 26, 2025
పంచాయతీ ఎన్నికలు.. SEC ఆదేశాలు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్‌డేట్ ఇచ్చింది. SEP 2 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితా ప్రిపేర్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న జిల్లా స్థాయి సమావేశం, 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆగస్టు 28-30 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 31న వాటిని పరిష్కరించాలని పేర్కొంది.