News October 10, 2024
బ్రూక్&రూట్.. WORLD RECORD

పాక్‌తో తొలి టెస్టులో అదరగొట్టిన బ్రూక్(317), రూట్(262) వరల్డ్ రికార్డ్ సాధించారు. విదేశీ గడ్డపై ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్‌నర్‌షిప్(454) నమోదు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. 1934లో బ్రాడ్‌మన్&పోన్స్‌ఫోర్డ్(AUS) ఇంగ్లండ్‌పై 451 స్కోర్ చేయగా, 90 ఏళ్లకు ఆ రికార్డును బ్రూక్&రూట్ బద్దలుకొట్టారు. 3,4,5 స్థానాల్లో అటపట్టు&సంగక్కర 438(vsZIM), జయవర్దనే&సమరవీర 437(vsPAK), డిప్పెనార్&రుడాల్ఫ్(vsBAN) ఉన్నారు.
Similar News
News October 26, 2025
చుండ్రు తగ్గించే హెయిర్ ప్యాక్స్

కాలంతో సంబంధం లేకుండ చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. దీనికోసం ఈ ప్యాక్స్. * 3 స్పూన్ల హెన్నా, స్పూన్ ఆలివ్ నూనె, ఎగ్ వైట్ కలిపి జుట్టు మొత్తానికి అప్లై చేసి 45 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. * పావు లీటర్ ఆవనూనె వేడి చేసి అందులో గుప్పెడు గోరింటాకు, స్పూన్ మెంతులు వేసి చల్లారాక సీసాలో స్టోర్ చేసుకోవాలి. దీన్ని తలస్నానం చేసే గంట ముందు రాసుకుంటే ఫలితం ఉంటుంది.
News October 26, 2025
తుఫాను అప్‌డేట్

AP: బంగాళాఖాతంలోని వాయుగుండం సాయంత్రానికి తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA అధికారులు చెప్పారు. ప్రస్తుతం కాకినాడకు 880 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.
News October 26, 2025
దుక్కి సమస్య నేలల్లో బాగా మొలక రావాలంటే?

మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువుగా దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇక్కడ వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పంట సరిగా మొలకెత్తదు. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ (లేదా) పళ్లదంతెతో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.


