News March 22, 2024
బెజవాడ గడ్డపై అన్నదమ్ముల పోరు..

AP: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీటు విజయవాడ పార్లమెంట్ స్థానం. గతంలో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కాగా ఇక్కడ తొలిసారిగా అన్నదమ్ములు ఈసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి కేశినేని నాని, TDP తరఫున నాని తమ్ముడు కేశినేని చిన్ని కదనరంగంలో కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ TDP గెలిచిన MP సీటు ఇది. మరి బెజవాడ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.
Similar News
News April 7, 2025
ట్రంప్ దెబ్బ.. మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిది!

ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 3.9%, హాంకాంగ్- 8.7%, సింగపూర్- 7%, జపాన్- 6%, చైనా- 5.5%, మలేషియా- 4.2%, ఆస్ట్రేలియా- 4.1%, ఫిలిప్పీన్స్- 4%, న్యూజిలాండ్-3.6% నష్టపోయాయి. కొన్ని నెలల పాటు ఈ టారిఫ్స్ ఒడుదొడుకులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.
News April 7, 2025
ఐటీ నోటీసులకు భయపడం: పృథ్వీరాజ్ తల్లి

రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు ఐటీ నోటీసులు రావడంపై ఆయన తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తునకు భయపడేది లేదని చెప్పారు. అంతకుముందు సినిమా విషయంలో వివాదం చెలరేగగా పృథ్వీరాజ్కు స్టార్ హీరో మమ్ముట్టి అండగా ఉండటం తనను కదిలించిందని తెలిపారు. తన కొడుకుకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
News April 7, 2025
STOCK MARKETS: రూ.19 లక్షల కోట్ల నష్టం!

భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.