News March 18, 2024
సోదరుడు అర్వింద్‌ను ఆశీర్వదించాలి: ప్రధాని మోదీ

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి, సోదరుడు ధర్మపురి అర్వింద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలని తమకు ఓటేయాలని ఆయన కోరారు.
Similar News
News February 4, 2026
NZB: అందుకే కాంగ్రెస్‌లోకి రాలేదు: MP

హిందూ వ్యతిరేకులు కనుకనే తాను కాంగ్రెస్‌లోకి రాలేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ తమ కుటుంబానికి ఎంతో దగ్గర అయినప్పటికీ తాను ఆ పార్టీ హిందూ వ్యతిరేకం కనుకనే కాంగ్రెస్‌లో చేరలేదన్నారు. తన తండ్రిని అవమానపరిచి కాంగ్రెస్ నుంచి బయటకు పంపారన్నారు. తన కార్లపై, ఇంటిపై దాడులు చేశారని మండి పడ్డారు.
News February 4, 2026
NZB: పురు పోరు…. ప్రచారం షురూ….

ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. అభ్యర్థుల నామినేషన్లు, పరిశీలనలు ఉపసంహరణలు పూర్తయ్యాయి. బీఫామ్ లు పార్టీలు అందించడంతో ఇక అభ్య ర్థుల లెక్క కూడా తేలిపోయింది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కోవార్డులో ఇద్దరికి మించి నామినేషన్లు వేశారు. అధిష్టానాల నిర్ణయం మేరకు బీ ఫామ్లు అందడంతో ప్రధాన ఘట్టం ప్రచారం మొదలైంది.
News February 4, 2026
నిజామాబాద్: ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కడంటే?

ఆర్మూర్, భీంగల్, బోధన్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 153 మంది, బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు 162 మంది, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.


