News March 19, 2024
రెండు రాష్ట్రాలకు DGPలుగా బ్రదర్స్

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నత ఉద్యోగాలు సాధించడం మనం చూశాం. తాజాగా ఇద్దరు సోదరులు రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపికై చరిత్ర సృష్టించారు. గుజరాత్ డీజీపీగా వికాస్ సాహే ఏడాదిగా పనిచేస్తుండగా, బెంగాల్‌కు వివేక్ సాహేను పోలీస్ బాస్‌గా నిన్న ప్రభుత్వం నియమించింది. కాగా వారి మరో సోదరుడు విక్రమ్ సాహే IRS అధికారిగా పనిచేస్తుండటం విశేషం.
Similar News
News February 8, 2026
జైపూర్‌లోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

జైపూర్‌లోని <
News February 8, 2026
JEE మెయిన్ ‘కీ’లో 17 తప్పులు? బోనస్ మార్కుల కోసం డిమాండ్

JEE మెయిన్ 2026 సెషన్-1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లో 17 తప్పులున్నాయని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఫిజిక్స్‌లో ఎక్కువ పొరపాట్లు దొర్లాయని, వీటి వల్ల విద్యార్థుల ర్యాంకులు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుగా ఉన్న 10 ప్రశ్నలకు బోనస్ మార్కులు ఇవ్వాలని, మిగిలిన 7 ప్రశ్నల సాంకేతిక లోపాలను సరిదిద్దాలని NTAను డిమాండ్ చేసింది. Feb 12న తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
News February 8, 2026
బంగ్లా హిందువులకు మద్దతు లభిస్తుంది: RSS

బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై RSS చీఫ్ మోహన్ భాగవత్ శతాబ్ది ఉత్సవాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాలో దాదాపు రూ.1.25 కోట్లమంది హిందువులు ఉన్నారు. వారి హక్కుల కోసం పోరాడాలి అనుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి మద్దతుగా నిలుస్తారు’ అని తెలిపారు. అలాగే ‘RSS చీఫ్ పదవికి విరమణ అనేది ఉండదు. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కూడా రాలేదు. అయితే దిగమంటే దిగిపోతాను’ అని స్పష్టం చేశారు.


