News May 14, 2024
BRSకు మంచి సీట్లు వస్తాయి: నామా
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ పార్టీ విజయానికి సోపానమని BRS ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో సానుకూల ప్రభావం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో BRSకు మంచి సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం ఓటర్లు విజ్ఞతతో ఓటు వేశారని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 28, 2024
పేదలందరికీ ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం కూసుమంచిలో పర్యటించారు. గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి తనను గెలిపించారని, నియోజవర్గ ప్రజలు ఆశలను వమ్ము చేయనని అన్నారు. త్వరలోనే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని.. ఇదంతా ప్రజలిచ్చిన దీవెనలు, ఆశీస్సులతోనే జరిగిందన్నారు.
News November 27, 2024
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం 17, అటు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాలతో 15,16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎముకలు కొరికే ఈ చలిలో ఉదయాన్నే బయటకు రావాలంటేనే ప్రజలు గజ గజలాడుతున్నారు. అటు వృద్ధులు, పిల్లలు పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది.
News November 27, 2024
ఖమ్మం రీజీయన్ RTCలో 116 కాంట్రాక్టు ఉద్యోగాలు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఖమ్మం రీజీయన్‌లో 116 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT