News March 28, 2024
BRSకు షాక్.. నీలం మధుతో ఎలక్షన్ రెడ్డి (PHOTO)

BRSకు షాక్ తగిలింది. మెదక్ కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ఎలక్షన్ రెడ్డి BRSను వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో నీలం మధు, నర్సారెడ్డితో ఆయన భేటీ చర్చనీయాంశమైంది.
Similar News
News February 8, 2026
MDK: మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 8, 2026
నర్సాపూర్: పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ తనిఖీ

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఫెసిలిటేషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News February 7, 2026
మెదక్: ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల లెక్కింపు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందన్నారు.


