News April 25, 2024

BRS ఎంపీ అభ్యర్థి కవితపై రెండు కేసులు

image

మహబూబాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితపై రెండు పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆమె భర్త బద్రు నాయక్, కుమార్తె మహతి, కుమారుడు నయన్ ఆస్తులు విలువ అంతా కలిపి రూ.3,97,72,259 ఉంటుందని చూపించారు. రెండు వాహనాలకు రూ.39,30,000, బంగారం 115 తులాలకు గాను విలువ రూ.76,13,000 ఉన్నట్లు వివరించారు. అప్పులు రూ.10,05,024 ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.

Similar News

News February 9, 2026

ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనకు ముమ్మర సర్వే

image

ఖమ్మం జిల్లాను కుష్టు రహితంగా మార్చేందుకు వైద్యశాఖ రెండో విడత ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 13 వరకు ఆశా కార్యకర్తలు అనుమానితులను గుర్తించి ఉచిత వైద్యం అందిస్తారు. ఈ ఏడాది కొత్తగా 74 కేసులు నమోదయ్యాయి. శరీరముపై స్పర్శ లేని మచ్చలుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని, క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామారావు తెలిపారు

News February 9, 2026

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంగా జరగాల్సిన డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కోఆర్డినేటర్ వీరన్న తెలిపారు. ఎన్నికల విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News February 9, 2026

పందిళ్లపల్లికి యూరియా రాక.. మూడు జిల్లాలకు కేటాయింపు

image

రైతులకు ఊరటనిస్తూ పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం యూరియా చేరుకుంది. క్రిబ్కో కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్ టన్నుల ఎరువులు రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చినట్లు ఏఓ పవన్‌కుమార్ తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,246 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెంకు 500, మహబూబాబాద్‌కు 700 టన్నుల యూరియాను కేటాయించారు. మిగిలిన 200 టన్నులను అత్యవసర అవసరాల కోసం బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.