News March 20, 2025
BRS ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదు: దేవరకద్ర ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం మదనాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమన్నారు.
Similar News
News April 24, 2025
పాపన్నపేట: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు మృతి

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు మృతి చెందాడు. పాపన్నపేట ఏఎస్ఐ సంగన్న కథనం ప్రకారం.. కొడుపాకకు చెందిన అవుసుల శ్రీకాంత్ (24) స్వర్ణకారుడుగా పనిచేస్తున్నాడు. ఈనెల 21న రాత్రి ఇంట్లో భార్య, తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది శ్రీకాంత్ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని మృతుడి భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News April 24, 2025
నరసరావుపేట: కావ్యశ్రీని దత్తత తీసుకున్న కలెక్టర్

పదో తరగతిలో 590 మార్కులు సాధించిన కారంపూడి జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కావ్యశ్రీని జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు బుధవారం దత్తత తీసుకున్నారు. పేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన కావ్యశ్రీ ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆమె తల్లిదండ్రులు రామయ్య, కోటేశ్వరమ్మ దంపతులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News April 24, 2025
ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

ఖమ్మం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నేలకొండపల్లి, ఎర్రుపాలెం 42.9, ఖమ్మం(U), మధిర (సిరిపురం) 42.8, వైరా, ముదిగొండ (పమ్మి) 42.7, చింతకాని 42.6, కూసుమంచి, రఘునాథపాలెం 42.5, ఖమ్మం (R) పల్లెగూడెం 42.4, సత్తుపల్లి 42.2, తిరుమలాయపాలెం 41.8, వేంసూరు, ఏన్కూరు 41.4, కామేపల్లి (లింగాల) 41.0 నమోదైంది.