News March 16, 2025

BRS తీరును ఖండిస్తూ జిల్లాలో కాంగ్రెస్ నిరసన

image

BRS నాయకులు దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. RR జిల్లా వ్యాప్తంగా KTR, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి, BRS దళిత వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News November 11, 2025

ప్రజావాణికి 29 ఫిర్యాదులు: రంగారెడ్డి కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు అందాయన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News November 9, 2025

మూసాపేటలో హైడ్రాకు మద్దతు.. ప్లకార్డులతో హర్షం

image

హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కబ్జాల నుంచి పార్కులను విడిపించుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని ఏళ్లుగా పోరాడామో హైడ్రా రావడంతో అవన్నీ మా సొంతం అయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్‌లో పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.