News March 3, 2025
BRS నేత సుబ్బారావుకు KCR రూ.10 లక్షల ఆర్థిక సాయం

ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం టౌన్ పార్టీ మాజీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుబ్బారావును ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు ఆహ్వానించి ఆయన ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల కోసం రూ.10లక్షల చెక్కును స్వయంగా సుబ్బారావుకు అందజేశారు.
Similar News
News March 4, 2025
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు

యాసంగి పంటలను సంరక్షించేలా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యులర్‌గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.
News March 4, 2025
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం నగరంలోని మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత తెలియజేశారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈనెల పదో తేదీలోగా ఖమ్మంలోని మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలకు టేకులపల్లిలో ఉన్న మహిళా ప్రాంగణం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 4, 2025
ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

రఘునాథపాలెం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.