News March 23, 2024
BRS పార్టీకి తేరా చిన్నపరెడ్డి రాజీనామా

BRS పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా చేశారు. శనివారం రాజీనామా లేఖను బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు పంపారు. నల్గొండ పార్లమెంటు స్థానాన్ని ఆశించిన తేరా చిన్నపురెడ్డికి నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కేటాయించకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు.
Similar News
News December 13, 2025
చిన్నకాపర్తిలో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదు: కలెక్టర్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డ్రైనేజీలో ఓట్లు దొరికిన ఘటనపై ఎలాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లు బయటపడగానే ఆర్డీఓ అశోక్ రెడ్డిని పంపి విచారణ జరిపించామన్నారు. పోలైన ఓట్లు, కౌంటింగ్లో లెక్కించిన ఓట్లు, డ్రైనేజీలో దొరికిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయని కలెక్టర్ తెలిపారు.
News December 13, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులపై నిషేధం: ఎస్పీ

నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జిల్లాలో BNSS 163 అమలులో ఉన్నందున, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా, డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
News December 13, 2025
పోలింగ్, కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

నల్గొండ: రేపు (ఆదివారం) జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.


