News April 12, 2025
BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి: మాజీ ఎమ్మెల్యే

హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. రజాతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నీళ్లు,నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటాలు చేసిందన్నారు.
Similar News
News November 27, 2025
KMR: జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల జాతర!

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇయాల్టి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఎన్నికల మొదటి విడతలో భాగంగా, జిల్లాలోని 167 గ్రామ పంచాయతీలు (1520 వార్డులకు) ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రోజు నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ఎంత ఉత్సాహం చూపిస్తారో, ఎంత మంది నామినేషన్ వేస్తారో అనేది చూడాలి. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
జిల్లాలో నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు కొనసాగనుంది. వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని 85 సర్పంచ్ స్థానాలు, 748 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
జనగామ: నేడు మొదటి విడత జీపీ ఎన్నికల నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లను ఈరోజు ఉ.10 నుంచి సా.5 గం.ల వరకు అధికారులు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జనగామ జిల్లాలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, జఫర్గడ్ మండలంలోని 110 గ్రామపంచాయతీలు, 1024 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


