News March 29, 2024
BRS రాజేంద్రనగర్ MLA పార్టీ మార్పు.. క్లారిటీ..!

పార్టీ మార్పు అంశంపై BRS రాజేంద్రనగర్ MLA క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తెలంగాణభవన్లో జరిగిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాకపోవడంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు. ‘మార్చి 31న మనవరాలి పెళ్లి ఉంది. పనుల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాను. అంతమాత్రాన ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అంటూ ప్రకాశ్ గౌడ్ హెచ్చరించారు.
Similar News
News November 24, 2025
సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
News November 24, 2025
GHMC చరిత్రలో తొలిసారి.. గ్రూప్ ఫొటో

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏండ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ గ్రూప్ ఫొటోను కౌన్సిల్ హాల్లో ప్రదర్శింపజేద్దాం. ఈ సంప్రదాయానికి మనమే నాంది పలుకుదాం’ అని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయంపై పాలకవర్గం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.


