News May 3, 2024
BRS లేకుండా చేయాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర: హరీశ్ రావు
కాంగ్రెస్, బీజెపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలో చెరో 8 ఎంపీ స్థానాలను పంచుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. BJP పదేళ్ల పాలన, కాంగ్రెస్ 5 నెలల పాలనపై మాట్లాడకుండా మతం, రిజర్వేషన్ల పేరిట సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
Similar News
News November 5, 2024
GREAT.. మన గజ్వేల్ బిడ్డ పైలట్‌గా ఎంపిక
సిద్దిపేట జిల్లాకు చెందిన వేముల యశస్విని కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన వేముల మురళీ-వసుంధర దంపతుల కుమార్తె యశస్విని ఇటీవల మహారాష్ట్రలోని పూణేలో శిక్షణను పూర్తి చేసుకుంది. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇండిగో ఎయిర్ లైన్స్‌లో పైలెట్‌గా ఎంపికైంది. దీంతో కుటుంబీకులు, గ్రామస్థులు ఆమెను అభిందించారు.
–
News November 5, 2024
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మంత్రి రాజనర్సింహా
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రైస్ మిల్లర్స్ అండర్ టేకింగ్ త్వరితగతిన అందజేయాలని సూచించారు. కొనుగోలు సమస్యలతో రైతులు రోడ్లమీదకు రావద్దన్నారు. సోమవారం మెదక్‌లో ధాన్యం కొనుగోలు, మిల్లర్స్ అండర్ టేకింగ్, డిఫాల్ట్ మిల్లుల సమస్యలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
News November 4, 2024
పటాన్‌చెరు: హాస్టల్ గదిలో విద్యార్థిని సూసైడ్
పటాన్‌చెరు పరిధిలోని ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని వైష్ణవి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెప్పారు. దీంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమై విద్యార్థిని మృతదేహాన్ని బాచుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.