News April 25, 2024
BRS ఎంపీ అభ్యర్థి కవితపై రెండు కేసులు

మహబూబాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితపై రెండు పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆమె భర్త బద్రు నాయక్, కుమార్తె మహతి, కుమారుడు నయన్ ఆస్తులు విలువ అంతా కలిపి రూ.3,97,72,259 ఉంటుందని చూపించారు. రెండు వాహనాలకు రూ.39,30,000, బంగారం 115 తులాలకు గాను విలువ రూ.76,13,000 ఉన్నట్లు వివరించారు. అప్పులు రూ.10,05,024 ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.
Similar News
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News April 23, 2025
ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.
News April 23, 2025
KMM: ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందొద్దు: DEO

జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయని, కేవలం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DEO సోమశేఖర్ వర్మ అన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజును పట్టించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఫెయిల్ అయ్యామని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించి సరైన సూచనలు ఇవ్వాలని కోరారు.