News March 20, 2025

BRS ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదు: దేవరకద్ర ఎమ్మెల్యే

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం మదనాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమన్నారు.   

Similar News

News March 21, 2025

జీవీఎంసీలో మారనున్న పార్టీల బలాబలాలు

image

జీవీఎంసీలో పార్టీల బలాబలాలు మారనున్నాయి. 97 వార్డుల్లో అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌గా హరి వెంకట కుమారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జీవీఎంసీపై ప్రభావం పడింది. 9 మంది కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. ఒక కార్పొరేటర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కూటమి బలం పుంజుకుంది. కాగా అవిశ్వాస తీర్మాన అంశం తెరపైకి వచ్చింది.

News March 21, 2025

MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 13,038 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.

News March 21, 2025

నల్గొండ: DSPకి ప్రశంసా పత్రం

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసినందుకు గాను నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని డీఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు.

error: Content is protected !!