News December 15, 2025
BRS, కాంగ్రెస్ మద్దతు.. CPMకు కంఠాయపాలెం ఉప సర్పంచ్?

MHBD జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైనట్లు సమాచారం. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ 5, సీపీఐ(ఎం) 2, బీఆర్ఎస్ మద్దతుదారులు 2, అధికార కాంగ్రెస్ 1 వార్డు గెలిచారు. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఒక్క వార్డు సభ్యుడు బీఆర్ఎస్, సీపీఎంకు మద్దతు ఇవ్వడంతో వీరి బలగం 5కు చేరి ఉపసర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 17, 2025
పెద్దకొడప్గల్: ఓటు వేయడానికి వస్తూ అనంతలోకాలకు..

ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వగ్రామానికి వస్తున్న బిచ్కుంద (M) పుల్కల్ వాసి బక్కోల సాగర్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాగర్ మంగళవారం HYD నుంచి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పుల్కల్ బయలుదేరాడు. అయితే, బుధవారం పెద్ద కొడప్గల్ PS పరిధిలోని హైవేపై శవమై కనిపించాడు. మరొకరు తీవ్రగాయాలై కనిపించగా అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News December 17, 2025
సంక్రాంతికి మరో 16 స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం దక్షిణమధ్య రైల్వే సర్వీసులు పెంచుతోంది. తాజాగా మరో 16 ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. రైళ్ల పూర్తి సమాచారం కోసం ఇమేజ్ స్లైడ్ చేయండి.
News December 17, 2025
సూర్యాపేట: ఓటు వేసిన వందేళ్ల బామ్మ..!

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మఠంపల్లి మండలం బక్కమంతల గూడెం గ్రామంలో శతాధిక వయస్సు గల మామిడి నాగరత్నమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయస్సు, ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేయడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.


