News December 18, 2024
BRS నేతల నిరసనపై మంత్రి సీతక్క కామెంట్స్

అసెంబ్లీలో ఈరోజు నల్లచొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో BRS నేతలు చేసిన నిరసనపై మంత్రి సీతక్క కామెంట్స్ చేశారు. KTR, హరీశ్ బేడీలు వేసుకోలేదని, కేవలం వారి పార్టీ MLAలకే బేడీలు వేశారన్నారు. ఈ ఘటనతో KTR, హరీశ్ దొరతనం మరోసారి బయటపడిందన్నారు. నిరసనలో కూడా BRS నేతల్లో సమానత్వం లేదని, తమ దురంహకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన అంశంపై CM సీరియసై చర్యలు తీసుకున్నారన్నారు.
Similar News
News February 28, 2026
వరంగల్: ఇంటర్ పరీక్షలకు 212 మంది గైర్హాజరు

జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధుల గైర్హాజరు కలవర పెడుతోంది. ఒకే రోజులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,179 మందిలో 143 మంది, ఒకేషనల్ కోర్సుకు 823 మందిలో 69 మంది గైర్హాజరైనట్లు డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 212 మంది హాజరు కాలేదన్నారు. పరీక్షల నిర్వహణలో పరీక్ష నిర్వాహకులుగా మాధవరావు, బండి విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లు వెల్లడించారు.
News February 28, 2026
మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలి: కలెక్టర్

పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య శారద పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె సమీక్షించారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
News February 27, 2026
గ్రేటర్ వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బస్సుల నిర్వహణకు అవసరమైన డిపో స్థలాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.


