News October 19, 2024
BRS పటాన్‌చెరు నియోజకవర్గ కొత్త బాస్ ఎవరు..?

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రస్తుత పటాన్‌చెరు MLA మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై BRS అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందుకోసం హరీశ్‌రావు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, సన్నిహితులతో చర్చిస్తూ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కొత్త ఇన్‌ఛార్జి నియామకంపై కసరత్తు చేస్తున్నారు. చూడాలి మరీ ఆ పదవీ ఎవరిని వరిస్తుందో.
Similar News
News November 8, 2025
మెదక్: ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

చర్చ్ అఫ్ సౌత్ ఇండియా మెదక్ కేథడ్రల్ పాస్టరేట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 మంది సభ్యుల ఎన్నిక కోసం మొత్తం 60 మంది అభ్యర్థులు(జీఎస్‌పీ, పాస్‌నేట్, ఆల్ఫా ఒమేగా ప్యానెల్‌ల తరపున) పోటీపడ్డారు. 1712 మంది సభ్యులుండగా 1451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.75% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలు రానున్నాయి. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
News November 8, 2025
TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొండల్ రెడ్డి

తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా నూతన శాఖ ఏర్పడింది. TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బి .కొండల్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ కూచన్‌పల్లి పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జడ్పిహెచ్ఎస్ ఝాన్సీ లింగాపూర్), కోశాధికారిగా శివ్వ నాగరాజు (శంకరంపేట(R)), ఉపాధ్యక్షుడిగా బాలరాజు (జడ్పీహెచ్ఎస్ కుర్తివాడ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు.
News November 8, 2025
మెదక్ జిల్లాలో 14,15 తేదీల్లో కవిత పర్యటన

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత ఈనెల 14, 15 తేదీల్లో మెదక్ జిల్లాలో పర్యటించానున్నారు. 14న మెదక్ జిల్లా శివంపేట నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నర్సాపూర్, కౌడిపల్లి, కుల్చారం మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. 15న మెదక్ పట్టణం నుంచి ఏడుపాయల సందర్శిస్తారు. పలు సందర్శన అనంతరం మెదక్‌లో మేధావుల సమావేశంలో పాల్గొంటారు. కేవల్ కిషన్ సమాధి సందర్శించనున్నారు.


